మూడు రోజుల క్రితం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మరణించిన ఓ యువకుడికి కరోనా పాజిటివ్ తేలటంతో విజయవాడలో ఆందోళన కలిగిస్తోంది. ఆంజనేయవాగు ప్రాంతంలోని ఓ రాజకీయ పార్టీ నాయకుడి సోదరుడి పెద్ద కుమార్తెకు 34సంవత్సరాలు గల కుమారుడు ఉన్నాడు. అతను కొన్ని రోజులుగా జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతున్నా అతనిని ఇంట్లోనే ఉంచి మందులు వాడారు. ఈ నెల 2న తీవ్ర అస్వస్థతకు గురికావటంతో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కొవిడ్ పరీక్షలకు నమూనాలు సేకరించారు. పరీక్ష ఫలితాలు రాకుండానే రాజకీయ పలుకుబడి ఉపయోగించి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు. చుట్టు పక్కనవారు, బంధువులు, పలువురు రాజకీయ నేతలు, స్థానిక పెద్దలు, అధికారులు సుమారు 300మంది వచ్చి యువకుడి భౌతికకాయాన్ని సందర్శించి వెళ్లారు. తీరా అతడికి పాజిటివ్ నిర్థరణ కావటంతో వారంతా భయంతో విలవిల్లాడుతున్నారు. అంత్యక్రియలకు హాజరైన వారంతా స్వచ్ఛందంగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని పోలీసులు, అధికారులు కోరుతున్నారు.
మృతి చెందిన యువకుడికి పాజిటివ్ - covid-19 news
విజయవాడలో కరోనా కలకలం రేగింది. వైరస్ బారిన పడి ఓ యువకుడు మృతి చెందాడు. ఇది తెలియక అతని అంత్యక్రియలకు భారీగా బంధువులు, తెలిసిన వారు హాజరయ్యారు. ఇప్పుడు విషయం తెలిసి వారంతా భయంతో విలవిల్లాడుతున్నారు. మృతుడు ఓ రాజకీయ పార్టీ నాయకుడి బంధువు అని తెలుస్తోంది.
మృతి చెందిన యువకుడికి పాజిటివ్
Last Updated : Jun 5, 2020, 11:09 AM IST