ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో 381కి చేరిన కరోనా కేసులు - రాష్ట్రంలో 381కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు

కరోనా కలవరపెడుతూనే ఉంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. కొవిడ్-19 కేసులు 381కి చేరినట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. గుంటూరు, తూర్పుగోదావరి, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో కొత్తగా 16 కేసులు నమోదయ్యాయని ప్రకటించింది.

రాష్ట్రంలో 381కి చేరిన కరోనా కేసులు
రాష్ట్రంలో 381కి చేరిన కరోనా కేసులు

By

Published : Apr 10, 2020, 8:44 PM IST

Updated : Apr 11, 2020, 3:50 AM IST

రాష్ట్రంలో 381కి చేరిన కరోనా కేసులు

రాష్ట్రంలో మరో 16 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 381కి పెరిగింది. గుంటూరు జిల్లాలో కొత్తగా 7 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మొత్తంగా జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 58కు చేరింది. కొత్తగా వైరస్‌ సోకిన వారంతా గుంటూరు నగరానికి చెందిన వారే. వీరంతా దిల్లీ వెళ్లి వచ్చిన వారి కుటుంబ సభ్యులని.. అధికారులు వెల్లడించారు. ఈ జిల్లాలో ఇంకా 220 మంది అనుమానితులకు సంబంధించిన నివేదికలు రావాల్సిఉంది. రాష్ట్రంలోనే అత్యధిక కేసులు నమోదైన జిల్లాల్లో గుంటూరు రెండో స్థానంలో ఉంది.

తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో

తూర్పుగోదావరి జిల్లాలో.. కొత్తగా ఐదు కేసులు నమోదయ్యాయి. ఈ జిల్లాలో పాజిటివ్ బాధితుల సంఖ్య... 17కు పెరిగింది. కొత్తగా వైరస్‌ సోకిన ఐదుగురూ కత్తిపూడి గ్రామానికి చెందిన వారే. విశాఖ జిల్లాకు చెందిన ఓ ఉపాధ్యాయుడికి వైరస్ ఉన్నట్లు గురువారం నిర్థరించారు. అతనితో సన్నిహితంగా మెలిగిన 38 మంది నమూనాలు సేకరించి పరీక్షలు చేయగా..తాజాగా 5కేసులు వెలుగులోకి వచ్చాయి. వీరిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఈ జిల్లాలో ఇంకా 83 మంది అనుమానితుల నమూనాల ఫలితాలు రావాల్సిఉంది.

కర్నూలు జిల్లాలో

కర్నూలు జిల్లాలో కొత్తగా ఇద్దరికి కరోనా సోకడం వల్ల ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 77కు పెరిగింది. కొత్త కరోనా కేసుల్లో ఒకరు కర్నూలు నగరం, మరోకరు ఆత్మకూరు పట్టణానికి చెందిన వారుగా అధికారులు తెలిపారు. వీరిద్దరు దిల్లీకి వెళ్లివచ్చిన వారి కుటుంబసభ్యులుగా గుర్తించారు. మరికొందరు అనుమానితుల నమునాల వివరాలు రావాల్సిఉందని కలెక్టర్ వెల్లడించారు.

ప్రకాశం జిల్లాలో

ప్రకాశం జిల్లాలోనూ కొత్తగా రెండు కరోనా పాజిటివ్‌ కేసులు వచ్చినట్టు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. వీరిలో మార్కాపురంలో దిల్లీ వెళ్లివచ్చిన ఓ యువకుడికి పాజిటివ్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇతను 15 రోజుల క్రితం దిల్లీ నుంచి రాగా ఇంటింటి సర్వేలో గుర్తించి క్వారంటైన్‌లో ఉంచారు. ఇప్పుడు కరోనా పాజిటివ్‌గా తేలడం వల్ల ఒంగోలు రీమ్స్‌కు తరలించారు. మొత్తంగా ఈ జిల్లాలో ఇప్పటివరకు కరోనా పాజిట్‌వ్‌ కేసులు 40కి పెరిగాయి.

ఇతర జిల్లాల్లో

నెల్లూరు జిల్లాలో ఇప్పటివరకు 48 కరోనా పాజిటివ్‌ కేసులు, కృష్ణా జిల్లాలో 35, కడప జిల్లాలో 29, పశ్చిమగోదావరి జిల్లాలో 22, విశాఖ జిల్లాలో 20, చిత్తూరు జిల్లాలో 20.. అనంతపురం జిల్లాలో 15 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

ఇక రాష్ట్రవ్యాప్తంగా 6374 నమూనాలను పరీక్షిస్తే.. అందులో 5993 నెగెటివ్‌గా నిర్ధరణ అయినట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. 10 మందిని ఇప్పటి వరకూ డిశ్చార్జి చేశారు. కరోనా కారణంగా 6 గురు మృతి చెందినట్టు తెలిపింది.

ఇవీ చదవండి:

కత్తిపూడిలో మరో 5 కరోనా పాజిటివ్ కేసులు

Last Updated : Apr 11, 2020, 3:50 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details