విజయవాడ గ్రామీణం...నున్న గ్రామంలో ఓ యువకుడికి కరోనా నిర్ధరణ కావడంపై... అధికారులు అప్రమత్తమయ్యారు. కరోనా లక్షణాలతో గ్రామంలోని మందుల దుకాణం వద్దకు ఓ యువకుడు వచ్చాడు. దుకాణం సిబ్బందికి అనుమానం వచ్చి...అధికారులకు సమాచారమిచ్చారు.
పరీక్షించగా అతనికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆ యువకుడు అద్దెకు ఉంటున్న గృహ పరిసరాల్లో పంచాయతీ సిబ్బంది శానిటైజ్ చేశారు. బాధితుడు సూరంపల్లి పారిశ్రామక వాడలో క్రీడా దుస్తులు తయారీ చేసే కంపెనీలో పనిచేస్తుండగా.. ఆ పరిసరాల్లోనూ బ్లీచింగ్ చల్లి... సంస్థను తాత్కాలికంగా మూసివేశారు.