హైదరాబాద్ ఛాతీ ఆస్పత్రిలో చికిత్స కోసం వచ్చిన వ్యక్తి ఊపిరాడక మృతిచెందిన ఘటన కలచివేస్తోంది. ఊపిరాడక పడిన నరకయాతన గురించి చెబుతూ సిబ్బంది పట్టించుకోవడం లేదని సెల్ఫీ వీడియోలో వాపోయాడు. అది తండ్రికి చేరకముందే కన్నుమూశాడు. లోపం ఎక్కడున్నా...చివరకు అతడి ప్రాణం మాత్రం గాలిలో కలిసిపోయింది. కన్నవారికి గర్భశోకం మిగిల్చింది. తనను నమ్ముకున్న భార్యా, పిల్లలను దిక్కులేని వారిని చేసింది.
ఎన్ని ఆస్పత్రులు తిరిగినా..
సికింద్రాబాద్ జవహర్‌నగర్‌కు చెందిన రవికుమార్ సౌదీ నుంచి రెండేళ్ల క్రితమే నగరానికి వచ్చాడు. కొద్దికాలంగా సొంతింటి నిర్మాణ పనుల్లో ఉన్నాడు. ఈనెల 23న శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది. తండ్రి వెంకటేశ్వర్లును వెంటబెట్టుకుని రెండు రోజులు సికింద్రాబాద్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఈసీఐఎల్‌లోని కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రులు తిరిగాడు. తన కొడుకును కాపాడాలని తండ్రి వేడుకున్నా ఎవరూ చేర్చుకోలేదు. ఈనెల ఓ ప్రైవేట్ ల్యాబ్‌లో కరోనా పరీక్ష నమూనాలిచ్చాడు. అదే రోజు ఆరోగ్యం మరింత ఇబ్బందిగా మారడం వల్ల నిమ్స్‌కు వెళ్లాడు. అక్కడ వైద్యుల సలహాతో ఛాతీ ఆసుపత్రిలో చేరాడు.
వీడియో తండ్రి చూసేసరికే..