ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పరీక్షల సంఖ్య 80 లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లో 82,045 కరోనా పరీక్షలు నిర్వహించగా .. 2,783 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో మరో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. వీటితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,23,348కి చేరింది. తాజా మరణాలతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 6,690 మంది కొవిడ్‌తో మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 3,708 మంది బాధితులు పూర్తిగా కోలుకోగా.. రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 7,92,083కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 24,575 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 80,28,905 కరోనా సాంపుల్స్‌ని పరీక్షించినట్లు వైద్యారోగ్య శాఖ బులెటిన్‌లో వెల్లడించింది.
రాష్ట్రంలో 80 లక్షలు దాటిన కరోనా పరీక్షలు
ఏపీలో కరోనా కేసులు
17:15 October 31
కొత్తగా 2,783 కరోనా కేసులు
రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో అత్యధికంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. గుంటూరు, విశాఖ, పశ్చిమ గోదావరిలో ఇద్దరు చొప్పున మృతి చెందగా.. అనంతపురం, తూర్పు గోదావరిలో ఒక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయినట్లు ఆరోగ్య శాఖ బులెటిన్‌లో తెలిపింది.
జిల్లాల వారీగా కేసుల వివరాలు..
Last Updated : Oct 31, 2020, 5:58 PM IST