విమానాల్లో రాకపోకలు సాగించే ప్రయాణికుల నిష్పత్తి 30 శాతం కంటే తక్కువగా నమోదు కావడంతో పలు విమానయాన సంస్థలు ఒక్కొక్కటిగా తమ సర్వీసులను రద్దు చేసుకుంటున్నాయి. కొన్నిరోజులుగా చెన్నై, హైదరాబాద్ సర్వీసులను స్పైస్ జెట్ సంస్థ నిలుపుదల చేయగా.. తాజాగా అదే ధోరణిని ఇండిగో సంస్థ కొనసాగిస్తోంది. మంగళవారం ఉదయం చేరుకోవాల్సిన హైదరాబాద్, తిరుపతి స్పెషల్, హైదరాబాద్-విజయవాడ-విశాఖపట్నం లింక్ సర్వీస్‌తో పాటు.. రాత్రి 8.45 గంటలకు ఉండే మరో హైదరాబాద్ సర్వీసును కూడా ఇండిగో రద్దు చేసింది.
విమాన సర్వీసులపై కరోనా ఎఫెక్ట్.. పలు సర్వీసులు రద్దు! - విజయవాడలో విమాన సర్వీసులు రద్దు వార్తలు
విమాన సర్వీసులపై కరోనా ఎఫెక్ట్ పడింది. నిత్యం రద్దీగా కనిపించే విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రస్తుతం ఆ కళ తప్పింది.

corona effect on flights
దేశంలో పెరుగుతున్న కరోనా ఉద్ధృతి దృష్ట్యా విమాన ప్రయాణాలకు ప్రజలు నిరాసక్తత చూపడమే సర్వీసుల రద్దుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
ఇదీ చదవండి:మాస్క్ ధరించకపోతే రూ.100 జరిమానా: సీఎం జగన్