corona effect on doctors : రాష్ట్రంలో కరోనా జడలు విప్పుతోంది . రోజువారీ కేసులు సంఖ్య 12 వేలు దాటింది. కరోనా చికిత్స చేస్తున్న వైద్య సిబ్బందికీ వైరస్ సోకుతుంది . ప్రస్తుతం ప్రభుత్వ ,ప్రైవేట్ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్యులు ,వైద్య సిబ్బంది అధికంగా కొవిడ్ బారినపడుతున్నారని భారత వైద్య సంఘం తెలిపింది . విజయవాడ జీజీహెచ్ లో 50 మందికి పైగా వైద్య సిబ్బందికి కొవిడ్ పాజిటివ్ వచ్చింది . విశాఖలో 30 మంది వరకు వైరస్ బారినపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో 25 నుంచి 30 శాతం సిబ్బంది ప్రస్తుతం కొవిడ్‌తో ఇబ్బంది పడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం తెలిపింది. కరోనా మొదటి, రెండో వేవ్‌ల సమయంలో వైద్యులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఇంకా పూర్తి స్థాయిలో నెరవేర్చలేదన్న రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడు జయధీర్....వాటిని నెరవేర్చాలని , వైద్యుల కోసం తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
corona effect on doctors : మళ్లీ వేగం పుంజుకున్న కరోనా కేసులు... వైద్య సిబ్బందిలో గుబులు - డాక్టర్లపై కరోనా ప్రభావం
corona effect on doctors : రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ తీవ్ర ప్రభావం చూపనప్పటికీ ... ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి ఎక్కువైంది. సాధారణ ప్రజలతో పాటు వైద్యులపైనా వైరస్ ప్రభావం అధికంగానే ఉంది. ప్రభుత్వ వైద్య సిబ్బందిలో చాలా మంది కొవిడ్ బారిన పడ్డారు. ఈ పరిస్థితుల్లో ధైర్యంగా చికిత్స చేసేందుకు తమ కుటుంబాలకు ప్రభుత్వం భరోసా ఇవ్వాలని వైద్యులు, వైద్య సిబ్బంది కోరుతున్నారు .
కొవిడ్ నిబంధనలు పాటించట్లేదు..
ప్రైవేట్ ఆసుపత్రుల్లోని వైద్య సిబ్బందీ కొవిడ్ బారినపడుతున్నారని ఐఎంఏ ఫైనాన్స్ అడ్వైజర్ సుభాష్ చంద్రబోసు అన్నారు. వైద్యులకు కావాల్సిన వసతులు అందేలా ప్రభుత్వం చూడాలన్నారు. కొందరు కొవిడ్ నిబంధనలు పాటించట్లేదని ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆసుపత్రుల రాష్ట్ర అధ్యక్షుడు బూసిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు. కరోనా మూడో వేవ్‌లో మరణాల సంఖ్య తక్కువగా ఉన్నా .. వ్యాప్తి వేగంగా ఉండటంతో వైద్య సిబ్బంది కొందరు ఆందోళన పడుతున్నారు . వారికి ప్రభుత్వం భరోసా కల్పించాలని వైద్యులు కోరుతున్నారు.
ఇదీ చదవండి