రాష్ట్రంలో కొత్తగా 4,622 కరోనా కేసులు నమోదు - కొవిడ్ 19 లక్షణాలు న్యూస్
18:05 October 13
వైరస్ కారణంగా 35 మంది మృతి
రాష్ట్రంలో ఒక్కరోజు వ్యవధిలో 72,082 నమూనాలను పరీక్షించగా 4,622 మందికి కొవిడ్ నిర్ధారణ అయినట్లు వైద్యఆరోగ్యశాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 7,63,573కి చేరింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం బులెటిన్ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో వైరస్ కారణంగా 35 మంది మృతిచెందారు. చిత్తూరు జిల్లాలో 7 మంది, కృష్ణా 5, కడప 4, ప్రకాశం 4, అనంతపురం 3, గుంటూరు 3, విశాఖపట్నం 3, తూర్పుగోదావరి 2, నెల్లూరు 2, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒకరు చొప్పున మరణించారు. ఇప్పటివరకు కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 6,291కి చేరింది. ఒక్కరోజులో 5,715 మంది కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకోగా.. 42,855 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 67,02,810 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.
ఇదీ చదవండి:
రాష్ట్రంలో భారీ వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక