రాష్ట్రంలో కొవిడ్ ఉద్ధృతి తగ్గటం లేదు. 24 గంటల వ్యవధిలో 70,455 కరోనా పరీక్షలు నిర్వహించగా....7,738 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. మరో 57 మంది ప్రాణాలు విడిచారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,25,514 మందికి వైరస్ సోకింది. 5,41,319 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకోగా...మరో 78,836 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మెుత్తం మృతుల సంఖ్య 5,359కు చేరుకుంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 51,04,131 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్యఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్‌లో వెల్లడించింది.
రాష్ట్రంలో కొత్తగా 7,738 కరోనా కేసులు, 57 మరణాలు - ఏపీలో తాజా కరోనా కేసులు
17:30 September 20
కరోనా తాజా కేసులు
జిల్లాల వారీగా కేసులు
తూర్పుగోదావరి జిల్లాలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో జిల్లాలో 1,260 కరోనా కేసులు నిర్ధరణ అయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లా 1,005, ప్రకాశం 869, చిత్తూరు 794, గుంటూరు 582, అనంతపురం 539, శ్రీకాకుళం 476, నెల్లూరు 444, విజయనగరం 446, కృష్ణా 439, విశాఖ 342, కర్నూలు 275, కడప 267 కరోనా కేసుల చొప్పున నమోదయ్యాయి.
జిల్లాల వారీగా మరణాలు
కృష్ణా 8, అనంతపురం 7, చిత్తూరు 7, ప్రకాశం 6, విశాఖలో 6, తూర్పుగోదావరి 4, కర్నూలు 4, కడప 3, శ్రీకాకుళం 3, పశ్చిమగోదావరి 3, గుంటూరు 2, నెల్లూరు 2 చొప్పున మృతి చెందారు.