కృష్ణా జిల్లాలో కరోనా వైరస్ ఉద్ధృతి పెరుగుతోంది. మరణాల సంఖ్య కూడా అధికంగానే ఉంటోంది. వీటితో పాటు కరోనా నుంచి కోలుకున్నవారు అధికంగానే ఉన్నారని అధికారులు చెబుతున్నారు. నిబంధనలు పాటిస్తున్నా..ప్రభుత్వ ఉద్యోగులు పలువురు వైరస్ బారిన పడుతున్నారు. ప్రతిరోజు నమోదవుతున్న కొత్త కేసుల్లో ఎక్కువ శాతం విజయవాడ నగరానికి చెందినవే ఉండడం గమనార్హం. కృష్ణలంకలో అధికంగా కేసులు నమోదవుతున్నాయి. మురికివాడలు, కాలనీలు అనే తేడా లేకుండా వైరస్ విజృంభిస్తోంది. సింగ్‌నగర్, వన్‌టౌన్, భవానీపురం, పటమట, మొగల్రాజపురం, మాచవరం, గుణదల తదితర ప్రాంతాల్లో అధికంగా నమోదు అవుతున్నాయి.
కరోనా పరీక్షల కోసం కాల్ చేయండి
గ్రామీణంలో.. ప్రసాదంపాడు, గొల్లపూడి, కానూరు, యనమలకుదురు, పోరంకిలో ఎక్కువ మందికి కరోనా వైరస్ సోకింది. మచిలీపట్నం డివిజన్‌లో కేసుల సంఖ్య 200 దాటాయి. నూజివీడు, గుడివాడ, జగ్గయ్యపేట పట్టణాల్లోనూ రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. కరోనా పరీక్షలు చేయించేందుకు, కొవిడ్ ఆసుపత్రుల్లో చేరేందుకు ప్రత్యేకంగా కాల్‌సెంటర్‌ను ఏర్పాటుచేశారు. కాల్ సెంటర్ నంబరు 94910 58200కు ఫోన్ చేసి ఆసుపత్రుల్లో చేరవచ్చని జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ సూచించారు. ప్రభుత్వం కరోనాకు ఎంత ఖర్చు చేసినా, ఎన్ని కార్యక్రమాలు తీసుకున్నా.. ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలని ఆయన కోరారు.
లక్షణాలుంటే వెంటనే ఆసుపత్రులకు రండి