గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 349 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8 లక్షల 81 వేల 948 కు చేరింది. వైరస్ కారణంగా మరో నలుగురు మృతి చెందగా... మొత్తం మృతుల సంఖ్య 7,104కి పెరిగింది. గడిచిన 24 గంటల వ్యవధిలో 472 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 8 లక్షల 71 వేల 588 కి పెరిగింది.
జిల్లాల వారీగా కరోనా కేసులు, మృతులు...