తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,07,329 నమూనాలను పరీక్షించగా.. 582 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 6,47,811కి చేరింది. తాజాగా కరోనా మహమ్మారికి ముగ్గురు బలయ్యారు. దీంతో మృతుల సంఖ్య 3,817కు పెరిగింది.
TS CORONA CASES: తెలంగాణలో కొత్తగా 582 కరోనా కేసులు..3 మరణాలు - telangana varthalu
తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా 582 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారిన పడి మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
తెలంగాణలో కొత్తగా 582 కరోనా కేసులు
టీఎస్‌లో ప్రస్తుతం 8,744 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా రికవరీ రేటు 98.06 శాతం కాగా.. మరణాల రేటు 0.58 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 83 కేసులు నమోదైనట్లు తెలిపింది.
ఇదీ చదవండి:ప్రపంచంపై 'డెల్డా' పడగ- ఆ నగరంలో ఆరోసారి లాక్డౌన్