Telangana Corona Cases: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గత నెలలో నిత్యం మూడు వేలకుపైగా వచ్చిన కేసులు అంతకంతకూ తగ్గుతున్నట్టు ఆరోగ్య శాఖ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 74,083 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 2,098 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 7,76,313కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది.
Telangana Corona Cases: తెలంగాణలో కొత్తగా 2,098 కరోనా కేసులు, 2 మరణాలు - ts corona
Telangana Corona Cases: తెలంగాణలో కొవిడ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. రాష్ట్రంలో తాజాగా 2,098 కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. వైరస్ బారిన పడి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
తెలంగాణలో కొత్తగా 2,098 కరోనా కేసులు, 2 మరణాలు
గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 4,099కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 3,801 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 29,226 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇవాళ 629 కేసులు నమోదయ్యాయి.
ఇదీ చదవండి: