రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వైరస్ ప్రభావం పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 22,604 కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 147 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 8,92,008కి చేరింది. కొవిడ్ కారణంగా కర్నూలు జిల్లాల్లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 7,185కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది.
రాష్ట్రంలో కొత్తగా 147 కరోనా కేసులు..ఒకరు మృతి - నేటి కరోనా వార్తలు
రాష్ట్రంలో కొత్తగా 147 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా వైరస్ బారిన పడి ఒకరు మృతి చెందారు. ఫలితంగా ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,92,008కి చేరింది.
రాష్ట్రంలో కొత్తగా 147 కరోనా కేసులు...ఒకరు మృతి
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 103 మంది పూర్తిగా కోలుకోగా.. ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 8,83,380కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,443 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,45,57,366 కరోనా సాంపుల్స్‌ని పరీక్షించినట్లు ఆరోగ్య శాఖ బులెటిన్‌లో వెల్లడించింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 35 మందికి కరోనా సోకింది.
ఇదీ చదవండి