రాష్ట్రంలో కొత్తగా 82 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 8,89,585 కరోనా కేసులు నమోదైనట్టు వైద్యారోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,168 మంది మృతిచెందారు. కొవిడ్ నుంచి మరో 74 మంది బాధితులు కోలుకోగా... ఇప్పటివరకు 8.81 లక్షల మందికి పైగా బాధితులు కోలుకున్నారు. 24 గంటల వ్యవధిలో 35,443 కరోనా పరీక్షలు చేయగా... ఇప్పటివరకు 1,38,43,190 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు.
రాష్ట్రంలో కొత్తగా 82 కరోనా కేసులు నమోదు - ఏపీ కరోనా వార్తలు
రాష్ట్రంలో కొత్తగా 82 కరోనా కేసులు నమోదయ్యాయని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కొవిడ్ నుంచి మరో 74 మంది బాధితులు కోలుకున్నారని తెలిపింది. రాష్ట్రంలో కరోనా నిర్ధరణ పరీక్షలు కోటీ 38 లక్షలు దాటాయని వివరించింది.
రాష్ట్రంలో కొత్తగా 82 కరోనా కేసులు