రాష్ట్రంలో కరోనా వైరస్ విలయం సృష్టిస్తోంది. పాజిటివ్ కేసులు రోజురోజుకీ తీవ్రస్థాయిలో నమోదు అవుతున్నాయి. 24 గంటల వ్యవధిలో 7,813 మందికి కరోనా పాజిటివ్ సోకిందని వైద్యారోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. ఉభయగోదావరి జిల్లాల్లో నమోదు అయిన కేసుల సంఖ్య 1000 మార్కును దాటింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 52 మంది కరోనా కారణంగా మృతి చెందారు. నిర్ధరణ పరీక్షలు ఎక్కువ చేస్తున్నందునే.. కేసుల సంఖ్య పెరుగుతోందని ప్రభుత్వం తెలిపింది.
రాష్ట్రంలో కొత్తగా.. 7,813 కరోనా కేసులు నమోదు - కరోనా లక్షణాలు
17:42 July 25
వైరస్ కారణంగా మరో 52 మంది మృతి
రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు నానాటికి పెరుగుతూ.. భయాందోళనలు కలిగిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో 7813 పాజిటివ్ కేసులు నమోదైనట్టు ప్రభుత్వం ప్రకటించింది. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1,324 మందికి కరోనా సోకింది. పశ్చిమగోదావరి జిల్లాలో 1,012 మందికి కరోనా వచ్చినట్టు ప్రభుత్వం తెలిపింది.
- అనంతపురం- 723
- చిత్తూరు 300
- గుంటూరు 656
- కడప 294
- కృష్ణా 407
- కర్నూలు 742
- నెల్లూరు 299
- ప్రకాశం 248
- శ్రీకాకుళం 349
- విశాఖ 936
- విజయనగరం 523
ఇప్పటి వరకూ రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 88,671కి చేరింది. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలోనే 12 వేల 391 కేసులు నమోదు అయ్యాయి. కర్నూలులో 10,357 కేసులు ఇప్పటి వరకూ నమోదైనట్టు వైద్యారోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 44వేల 430 మంది కొవిడ్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని.. అలాగే 43 వేల 255 మంది ఇప్పటి వరకూ డిశ్ఛార్జి అయినట్టు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.
కరోనా కారణంగా గడచిన 24 గంటల వ్యవధిలో 52 మంది మృతి చెందారు. అత్యధికంగా గుంటూరులో 9 మంది, పశ్చిమగోదావరి-8 , తూర్పుగోదావరి-6, కృష్ణా-6 , కర్నూలు-6 , చిత్తూరు-5, విజయనగరం-4, శ్రీకాకుళం, విశాఖలో ముగ్గురు చొప్పున, నెల్లూరు, ప్రకాశం ఒక్కొక్కరు చొప్పున మరణించినట్టు వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకూ నమోదైన కరోనా మృతుల సంఖ్య 985కు పెరిగింది. 24 గంటల వ్యవధిలో 53 వేల 681 నిర్ధరణ పరీక్షలు చేస్తే.. ఇప్పటి వరకూ ఆ సంఖ్య 15 లక్షల 95 వేల 674కు చేరింది.
ఇదీ చదవండి:శిరోముండనం చేసిన యువకుడిని.. ఆ రోజు రాత్రి ఇలా కొట్టారా?