AP CORONA CASES:రాష్ట్రంలో కొత్తగా 615 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి 2,787 మంది పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 12,550 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రంలో 24 గంటల్లో 22,267 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొంది. కొవిడ్ కారణంగా.. రాష్ట్రంలో నలుగురు మరణించారు.
నైట్ కర్ఫ్యూ ఎత్తివేత..
రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూను ఎత్తివేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. సోమవారం జరిగిన వైద్యారోగ్యశాఖ సమీక్షలో.. సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకోవడంతో అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. నైట్కర్ఫ్యూ ఎత్తివేసినా.. రాష్ట్రంలో కోవిడ్ నిబంధనలు కొనసాగుతాయని.. బహిరంగ ప్రదేశాల్లో మాస్కు ధరించటం తప్పనిసరని తెలిపింది. మాస్కు ధరించని వారికి రూ.100.. వాణిజ్య ప్రదేశాల్లో కొవిడ్ నిబంధనలు పాటించకపోతే.. రూ.25 వేల జరిమానా విధించనున్నట్లు స్పష్టం చేసింది. ఫిబ్రవరి 28 తేదీ వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది.
భారత్లో 30 వేల దిగువకు రోజువారీ కేసులు
India Covid cases: భారత్లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 27,409 మందికి వైరస్ సోకినట్లు తేలింది. కొవిడ్ ధాటికి మరో 347 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజే 82,817 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు.
- మొత్తం కేసులు:4,26,92,943
- మొత్తం మరణాలు:5,09,358
- యాక్టివ్ కేసులు:4,23,127
- మొత్తం కోలుకున్నవారు:4,17,60,458