AP CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 434 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి 4,636 మంది పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 14,726 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రంలో 24 గంటల్లో 15,193 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొంది. కొవిడ్ కారణంగా.. రాష్ట్రంలో ఒకరు మరణించారు.
- దేశంలో 35వేల దిగువకు కరోనా కొత్త కేసులు.. భారీగా తగ్గిన మరణాలు
Corona cases in India: భారత్లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు.. 34,113 మందికి వైరస్ సోకింది. కొవిడ్ ధాటికి మరో 346 మంది ప్రాణాలు కోల్పోయారు. 91,930 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 3.17 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
యాక్టివ్ కేసులు ప్రస్తుతం 1.12 శాతంగా ఉన్నాయి. రికవరీ రేటు 97.68 శాతానికి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
- మొత్తం కేసులు:4,26,65,534
- మొత్తం మరణాలు:5,09,011
- యాక్టివ్ కేసులు:4,78,882
- మొత్తం కోలుకున్నవారు:4,16,77,641