ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

40 సంవత్సరాలు పైబడిన వారిలో కరోనా మరణాల శాతం క్రమేణా పెరుగుతోంది

త్వరలో ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ కోవిడ్ చికిత్సకు అనుమతి ఇస్తామని రాష్ట్రవైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి జవహర్​రెడ్డి విజయవాడలో ప్రకటించారు. ఆసుపత్రుల్లో వంద పడకలు, ఇతర సౌకర్యాలను పరిగణలోకి తీసుకుని కోవిడ్​కు చికిత్స చేసేందుకు అనుమతినిస్తామని వెల్లడించారు.

coron in ap
రాష్ట్రవైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి జవహర్​రెడ్డి

By

Published : Jul 4, 2020, 11:56 AM IST

ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ కోవిడ్ చికిత్సకు అనుమతి ఇస్తామని రాష్ట్రవైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి జవహర్​రెడ్డి విజయవాడలో ప్రకటించారు. ఫీజులు ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటాయని..ఇప్పటికే ప్రకటించిన వాటికి స్వల్పంగా మార్పులు చేస్తున్నామని తెలిపారు. అన్​లాక్​-1 అమల్లోనికి వచ్చినప్పటినుంచి ఇప్పటివరకు 13, 258కేసులు నమోదయ్యాయని తెలిపారు. ప్రజల రాకపోకకు తగ్గట్లు కేసుల సంఖ్య పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం, చేతులను శుభ్రంచేసుకోవడం ద్వారా 90% వైరస్ బారినపడకుండా ఉండేందుకు వీలుందని స్పష్టం చేశారు. 40 సంవత్సరాలు పైబడిన వారిలో కరోనా మరణాల శాతం క్రమేణా పెరుగుతోందని అన్నారు. జిల్లాలోనే కోవిడ్ కేర్ కేంద్రాల్లో 2,000 పైగా పడకలు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.

వైరస్​తో చనిపోయిన వారి మృతదేహాలను గౌరవించాలని... మరణించిన ఆరు గంట అనంతరం వైరస్ వ్యాప్తి చెందదని ఆయన అన్నారు.. విజయవాడ జనరల్ ఆసుత్రిని నుంచి వృద్ధుడు మాయమైన ఘటనపై విచారణ చేస్తున్నామని తెలిపారు.

కట్టడిప్రాంత ఉపాధ్యాయులకు మినహాయింపు..

కట్టడి ప్రాంతం, రెడ్​జోన్ క్వారంటైన్​ కేంద్రాల్లో ఉన్న ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, విభిన్న ప్రతిభావంతులైన బోధన, బోధేనేతర సిబ్బందికి పాఠాశాల హాజరు మినహాయింపునిస్తూ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇదీ చూడండి.తాగునీటి సరఫరా ప్రాజెక్ట్ నిధులకు పరిపాలన అనుమతులు

ABOUT THE AUTHOR

...view details