రాష్ట్రంలో వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఎన్నికల వాయిదా వేసే ఉద్దేశం లేదని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. పీఏసీఎస్‌లో సభ్యత్వాలను పరిశీలించి అర్హుల వాస్తవికత తేల్చే ప్రక్రియ జరుగుతోందని ఏజీ శ్రీరామ్ హైకోర్టుకు తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించేది, తదితర వివరాల్ని అఫిడవిట్ రూపంలో కోర్టు ముందు ఉంచేందుకు సమయం కావాలన్నారు. వీలైనంత త్వరగా ఎన్నికలను నిర్వహించాలని సూచించిన ధర్మాసనం..అఫిడవిట్ దాఖలకు సమయమిస్తూ విచారణను ఏప్రిల్ 7 కు వాయిదా వేసింది.
'సహకార సంఘాల ఎన్నికలు వాయిదా వేసే ఉద్దేశం లేదు' - సహకార సంఘాల ఎన్నికలు వాయిదా వేసే ఉద్దేశం లే
సహకార సంఘాల ఎన్నికలు వాయిదా వేసే ఉద్దేశం లేదని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. అర్హుల వాస్తవికత తేల్చే ప్రక్రియ కొనసాగుతోందని ఏజీ స్పష్టం చేశారు. కాగా.. వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని ధర్మాసనం సూచించింది.
సహకార సంఘాల ఎన్నికలు వాయిదా వేసే ఉద్దేశం లేదు
TAGGED:
ఏపీలో సహకార సంఘాల ఎన్నికలు