ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Employees Protest: విజయవాడ ధర్నా చౌక్​లో ఉద్యోగులు మహా ధర్నా

Contract Employees Protest at Dharna Chowk: కాంట్రాక్టు, ఔట్​ సోర్సింగ్ ఉద్యోగులు విజయవాడలోని ధర్నా చౌక్​ వద్ద మహా ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఉద్యోగులకు సమాన పనికి సమన వేతనం, క్రమబద్దీకరణ డీఏ, హెచ్​ఆర్​ఏలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.

Contract Employees protest at vijayawada
ధర్నా చౌక్ వద్ద కాంట్రాక్​ ఉద్యోగుల ధర్నా

By

Published : Jan 31, 2022, 4:33 PM IST

కాంట్రాక్టు, ఔట్​ సోర్సింగ్​, పార్ట్ టైం, కంటింజెంట్, టైమ్ స్కేల్ ఉద్యోగులకు సమాన పనికి సమన వేతనం, క్రమబద్దీకరణ డీఏ, హెచ్​ఆర్​ఏలు అమలు చేయాలనీ డిమాండ్ చేస్తూ.. విజయవాడ ధర్నా చౌక్​లో ఉద్యోగులు మహా ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఉపాధి హామీ తదితర స్కీం వర్కర్లకు వేతనం పెంపుదల చేయాలని కాంట్రాక్టు మరియు ఔట్​ సోర్సింగ్​ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర కార్యదర్శి బాలకాశీ డిమాండ్ చేశారు. అధికారంలోకి రాగానే కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని, వేతనాలు పెంచుతామని ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి జగన్​ హామీ ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా ఒక్క హామీ కూడా అమలు చేయలేదన్నారు. ఇప్పుడు కాంట్రాక్టు ఔట్​ సోర్సింగ్​ ఉద్యోగులకు 20 శాతం వేతనాలు పెంచి పదేళ్ల వరకు ఇదే వేతనాన్ని కొనసాగిస్తామని చెప్పడం దుర్మార్గం అన్నారు.

రివర్స్ పీఆర్సీతో ఉద్యోగులకు తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో ఉద్యోగులకు ఇచ్చిన ప్రతీ హామీ అమలు చేయాలనీ డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా తమ ఉద్యమం మరింతా తీవ్రతరం చేస్తామని జేఏసీ రాష్ట్ర కార్యదర్శి బాలకాశీ హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details