ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CONSTITUTION DAY CELEBRATIONS IN AP : రాష్ట్రవ్యాప్తంగా రాజ్యాంగ దినోత్సవం - Constitution day celebrations

రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్‌ కార్యాలయాల్లో, ప్రజాసంఘాల ఆధ్వర్యంలోనూ రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. రాజ్యాంగం దేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటిందన్న వక్తలు.. ఇందులో పొందుపర్చిన అంశాలపై పౌరులు అవగాహన పెంచుకోవాలని సూచించారు.

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

By

Published : Nov 26, 2021, 9:59 PM IST

భారత రాజ్యాంగం ఆమోదం పొంది 72 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా.. విజయవాడ గాంధీ సెంటర్​లో డా.బీ.ఆర్. అంబేడ్కర్ విగ్రహానికి ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్(MLC Arun kumar) పూలమాల వేసి నివాళులర్పించారు. రాజ్యాంగ స్ఫూర్తితో అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి జగన్ పరిపాలన చేస్తున్నారని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ విజయవంతంగా మనుగడ సాధించటానికి రాజ్యాంగమే కీలక సాధనమని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుడితి రాజశేఖర్‌ అన్నారు. పటమటలోని కేబీసీ ఉన్నతపాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.

శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సమత సైనిక్ దళ్ ఆధ్వర్యంలో గోపీనాథపురంలో ర్యాలీ నిర్వహించారు. విజయనగరం కలెక్టరేట్​లో జరిగిన రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో.. సంయుక్త కలెక్టర్లు మహేశ్ కుమార్, కిశోర్ కుమార్​తోపాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. బొబ్బిలిలో నిర్వహించిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ సూర్య కుమారి పాల్గొన్నారు. పార్వతీపురం ఐటీడీఏ గిరిమిత్ర సమావేశ మందిరంలో నిర్వహించిన భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలలో ప్రాజెక్ట్ అధికారి కూర్మనాథ్ పాల్గొని అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేశారు.

భారతదేశానికి పటిష్టమైన రాజ్యాంగాన్ని రూపొందించిన డాక్టర్.బీ.ఆర్.అంబేడ్కర్ గొప్ప దార్శనికుడు అని తూర్పుగోదావరి జిల్లా పరిషత్ ఛైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అన్నారు. పి.గన్నవరంలో ఏర్పాటుచేసిన రాజ్యాంగ దినోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొని, అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం తాళ్వాయిపాడు ఉన్నత పాఠశాలలో రాజ్యాంగం దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు స్వాతంత్ర్య సమరయోధుల వేషధారణలతో ఆకట్టుకున్నారు.

ఇవీచదవండి.

ABOUT THE AUTHOR

...view details