ఈ నెల 12న విజయవాడ నగర శివారు భవానీపురం మౌలానగర్‌లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న వివాహిత రజనీ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. బంధువుల నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. మృతురాలి భర్త కృష్ణారావు.. ముఖ్యమంత్రి భద్రతా విభాగంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. వీరికి 15 నెలల బాబు ఉన్నాడు.
కానిస్టేబుల్ భార్య ఆత్మహత్య కేసులో కొనసాగుతున్న దర్యాప్తు - విజయవాడ కానిస్టేబుల్ భార్య ఆత్మహత్య కేసులో కొనసాగుతున్న దర్యప్తు
విజయవాడ నగర శివారులోని భవానిపురంలో కానిస్టేబుల్ భార్య ఆత్మహత్య కేసు విచారణ కొనసాగుతోంది. పోలీసులు మృతురాలి బంధువుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.
కానిస్టేబుల్ భార్య ఆత్మహత్య కేసులో కొనసాగుతున్న దర్యాప్తు
ఈనెల 11వ తేదీ రాత్రి కృష్ణారావు డ్యూటికి వెళ్తూ భార్య, కుమారుడిని ఇంట్లో ఉంచి తాళం వేసుకొని వెళ్లాడు. అతను విధులు ముగించుకొని ఉదయం ఇంటికి చేరుకునే సరికి రజనీ ఫ్యాన్‌కు ఉరివేసుకొని కనిపించింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన భవానీపురం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఇదీ చదవండి:ట్రాక్టర్ తిరగబడిన ఘటనలో యువకుడు మృతి