కృష్ణా జిల్లా నందిగామ డీఎస్పీ ఆఫీస్ కానిస్టేబుళ్లు రమేష్ కుమార్, గోపాల్.. మానవత్వం చాటుకున్నారు. డీఎస్పీ కార్యాలయం సమీపంలో ఓ వృద్ధురాలు సరైన దుస్తులు లేకుండా మండుటెండలో పడి ఉండటాన్ని గమనించి స్పందించారు. ఆమెకు దుస్తులు అందించారు. భోజనం పెట్టారు. అనంతరం ఆటోలో వృద్ధురాలి గ్రామమైన నవపేటకు పంపించారు.
మానవత్వం... వృద్ధురాలికి సహాయం చేసిన కానిస్టేబుళ్లు - krishna district latest news
ఖాకీ దుస్తులు వేసుకుని, విధులు నిర్వహిస్తూ గంభీరంగా కనిపించే పోలీసులకు.. మానవత్వమూ ఉంటుందని నిరూపించారు ఆ కానిస్టేబుళ్లు. సరైన దుస్తులు లేకుండా మండుటెండలో ఉన్న ఓ వృద్ధురాలికి బట్టలు అందించారు. ఆమెకు భోజనం పెట్టారు.
వృద్ధురాలికి సహాయం చేసిన కానిస్టేబుళ్లు
TAGGED:
కృష్ణా జిల్లా నేటి వార్తలు