ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

illegal contact : వ్యక్తిని కొట్టి చంపిన కానిస్టేబుల్... వివాహేతర సంబంధమే కారణం!

వివాహేతర సంబంధం కారణంగా ఏ.ఆర్ కానిస్టేబుల్ (AR constable)..​ ఓ వ్యక్తిని కొట్టి చంపిన ఘటన (murder) విజయవాడలో కలకలం సృష్టించింది. ఈ ఘటనలో కానిస్టేబుల్​తో పాటు అతనికి ఆశ్రయం ఇచ్చిన ఇంటి యజమాని దంపతులపై పోలీసులు కేసు (police case) నమోదు చేశారు.

విజయవాడలో వ్యక్తిని కొట్టి చంపిన కానిస్టేబుల్
విజయవాడలో వ్యక్తిని కొట్టి చంపిన కానిస్టేబుల్

By

Published : Aug 12, 2021, 9:06 PM IST

విజయవాడలోని ఓ పోలీస్ స్టేషన్​లో ఏఆర్ కానిస్టేబుల్​గా శివనాగరాజు విధులు నిర్వహిస్తున్నాడు. ఆయన నివాసముండే ఇంటిపై వెంకటేష్ అనే వ్యక్తి ఉండేవాడు. పరిచయస్థులు కావడంతో శివనాగరాజు భార్యతో వెంకటేష్​కు చనువు ఏర్పడింది. గుర్తించిన శివనాగరాజు.. వెంకటేష్​ను హెచ్చరించాడు. ఈ పరిణామాలతో వెంకటేష్ ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయాడు. అయినా.. శివనాగరాజు భార్యతో మాట్లాడుతుండేవాడు.

విధి నిర్వహణలో భాగంగా శివనాగరాజు డ్యూటీకి వెళ్లగా.. అతని ఇంటికి వెంకటేష్ వచ్చాడు. గమనించిన ఇంటి యజమాని శివనాగరాజుకు ఫోన్ చేశాడు. అనంతరం గది తలుపులు వేసి, తాళం వేశారు. శివనాగరాజు విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన తర్వాత.. గదిలో ఉన్న వెంకటేష్​ను విచక్షణారహితంగా కొట్టారు. తీవ్ర గాయాలపాలైన వెంకటేష్​ను ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలోనే మృతి చెందాడు. వెంకటేష్​పై దాడి చేసిన సమయంలో ఇంటి యజమాని దంపతులు అక్కడే ఉన్నా దాడిని ఆపే ప్రయత్నం చేయలేదని పోలీసులు వారిపైనా కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details