ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నాపై కుట్రలు తట్టుకోలేకే శ్రీనివాస్‌గౌడ్‌ హత్యకు పథకం: రాఘవేందర్‌రాజ్‌ - plan to srinivas goud murder case

తెలంగాణలో అలజడి సృష్టించిన మంత్రి శ్రీనివాస్​గౌడ్​ హత్య కుట్ర కేసును పోలీసులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఈ కుట్ర వెనక ఉన్న ప్రధాన నిందితుడైన రాఘవేందర్​రాజును పోలీసులు విచారించగా.. పలు కీలక విషయాలు వెల్లడించాడు.

నాపై కుట్రలు తట్టుకోలేకే శ్రీనివాస్‌గౌడ్‌ హత్యకు పథకం
నాపై కుట్రలు తట్టుకోలేకే శ్రీనివాస్‌గౌడ్‌ హత్యకు పథకం

By

Published : Mar 3, 2022, 10:42 PM IST

Srinivas Goud Murder Plan Case: తెలంగాణలో అలజడి సృష్టించిన మంత్రి శ్రీనివాస్​గౌడ్​ హత్య కుట్ర కేసును పోలీసులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. నిందితుల నుంచి నిజాలు రాబట్టే పనిలో తలమునకలయ్యారు. ఈ క్రమంలోనే.. ఈ కుట్ర వెనక ఉన్న ప్రధాన నిందితుడైన రాఘవేందర్​రాజును పోలీసులు విచారించగా.. పలు కీలక విషయాలు వెల్లడించాడు. తనను మంత్రి శ్రీనివాస్​ గౌడ్.. తీవ్ర ఇబ్బందులకు గురి చేశాడని తెలిపాడు. తన వ్యాపారలను దెబ్బతీసి.. ఆర్థికంగా నష్టం చేకూర్చాడని వివరించారు. తనపై మంత్రి చేస్తున్న కుట్రలు తట్టుకోలేకే శ్రీనివాస్​ గౌడ్​ హత్యకు పథకం వేసినట్టు విచారణలో వెల్లడించాడు.

విచారణలో రాఘవేందర్‌రాజు ఏం చెప్పాడంటే..

"నా వ్యాపారాలను మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ దెబ్బతీశారు. నన్ను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేశారు. నాపై అక్రమంగా కేసులు కూడా పెట్టించారు. నా స్థిరాస్తి వ్యాపారాన్ని దెబ్బతీశారు. నా బార్‌ దుకాణాన్ని మూసివేయించారు. అక్రమంగా ఎక్సైజ్‌ కేసులు నమోదు చేయించారు. నా ఆధార్‌ సెంటర్‌ను కూడా మంత్రి రద్దు చేయించారు. నాపై కుట్రలు తట్టుకోలేకే శ్రీనివాస్‌గౌడ్‌ హత్యకు పథకం వేశాను."- రాఘవేందర్‌రాజ్‌, నిందితుడు

కస్టడీ కోరిన పోలీసులు..

మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్యకు కుట్ర కేసులో.. నిందితులను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ మేడ్చల్‌ కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే 12 మందిని అదుపులోకి తీసుకున్న పేట్​బషీరాబాద్​ పోలీసులు.. వాళ్లను విచారించేందుకు వారం రోజుల కస్టడీ కోరారు.

సంబంధిత కథనాలు..

ABOUT THE AUTHOR

...view details