minister Srinivas goud : తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర జరిగినట్లు సైబరాబాద్ పోలీసులు వెల్లడించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఆయన సోదరుడు శ్రీకాంత్ హత్యకు సుపారీ గ్యాంగ్‌తో కుట్రపన్నినట్లు తెలిపారు. అయితే మంత్రి హత్య కుట్రను భగ్నం చేసి.. నలుగురిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు.
మహబూబ్‌నగర్‌కు చెందిన యాదయ్య, విశ్వనాథ్, నాగరాజు.. సుపారీ గ్యాంగ్‌తో హత్య చేయాలని భావించినట్లు పోలీసులు తెలిపారు. ఇందుకోసం ఫరూక్ అనే వ్యక్తికి సుపారీ ఇచ్చేందుకు యత్నించారు. అయితే ఈ విషయాన్ని ఫరూక్.. పేట్‌బషీరాబాద్ పోలీసులు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. యాదయ్య, విశ్వనాథ్, నాగరాజును అరెస్టు చేశారు. అనంతరం దర్యాప్తు చేపట్టారు.