60ఏళ్లు దాటిన వారి ఆరోగ్య వివరాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధులు కలిగి, వైరస్ సోకిన వారిలో ఎక్కువ మంది ప్రాణాపాయ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. మృతుల్లోనూ వీరి సంఖ్యే అధికం. దీంతో కరోనా కట్టడి ప్రాంతాల్లో 60 ఏళ్లు దాటిన వారికి వెంటనే వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయాలని, వీరి నమూనాలను సేకరించాలని వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
- వైద్య, ఆరోగ్యశాఖ వివరాల ప్రకారం...
* రాష్ట్రంలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు 12 లక్షల మంది
* వీరిలో 60 ఏళ్లలోపు వారు 8,08,409 మంది.
* 60 సంవత్సరాలు, ఆపైన 4,02,371 మంది.