అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున అమరావతి మహిళలపై వైకాపా ప్రభుత్వ దుశ్శాసన పర్వం శోచనీయమని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు తులసిరెడ్డి మండిపడ్డారు. రాజధాని అమరావతి పరిరక్షణ కోసం శాంతియుతంగా ఉద్యమిస్తున్న మహిళలను దుర్గమ్మ దర్శనానికి అనుమతించకుండా అరెస్టు చేయటం దుర్మార్గమన్నారు. ఆంధ్రుల ఆత్మాభిమానానికి, ఆత్మగౌరవానికి ప్రతీకైన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేయాలనుకోవటం కేంద్ర ప్రభుత్వ చారిత్రిక తప్పిదమన్నారు.
ఒకవైపు ఆత్మనిర్భర్ భారత్ అంటూ...దక్షిణ కొరియాకు చెందిన పోస్కో కంపెనీకి స్టీల్ ప్లాంట్ను అమ్మాలనుకోవటం భాజపా ద్వంద్వ నీతికి నిదర్శనమన్నారు. రామాయంపేట వద్ద మేజరు పోర్టు నిర్మించాల్సింది పోయి..ఆ ఊసే ఎత్తటం లేదన్నారు. రాష్ట్రానికి కేంద్రంలోని భాజపా ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోందోనటానికి ఇది ఒక ఉదాహరణ అన్నారు.