అమరవీరులకు కాంగ్రెస్ సలాం మౌనదీక్ష - Congress salam for martyrs
విజయవాడలో గాంధీ విగ్రహం వద్ద ఏఐసీసీ, పీసీసీ ఆదేశాల మేరకు అమరవీరులకు కాంగ్రెస్ సలాం పేరుతో కాంగ్రెస్ పార్టీ నాయకులు మౌన దీక్ష చేపట్టారు.

ఏఐసీసీ, పీసీసీ ఆదేశాల మేరకు అమరవీరులకు కాంగ్రెస్ సలాం పేరుతో విజయవాడలో గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు మౌన దీక్ష చేపట్టారు. సరిహద్దుల్లో అమరుల త్యాగాలు మరువలేనివని...కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారిని మరింత ఆదుకోవాలని ఏఐసీసీ సభ్యులు నరహరశెట్టి నరసింహారావు అన్నారు. ఏ ఒక్క సైనికుడి త్యాగాన్ని మనం మరువకూడదని..అమరులైన వీర జవాన్లకు సలాం చేశారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన సంతోష్ బాబు చరిత్రలో నిలిచిపోతారన్నారు. చైనా అక్రమంగా భారత్ భూభాగంలోకి చొచ్చుకురావాలనే ప్రయత్నాలు చేస్తుందని మండిపడ్డారు. చైనా ఆక్రమణ చేసిన భూమిని వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు.