ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Congress Executive Meeting: 'కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫ‌ల్యాల‌ను ప్రజల్లోకి తీసుకెళ్లాలి' - ఏపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం

PCC Executive Committee at Vijayawada: ప్రభుత్వాలు చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాల‌ను ఎండగడుతూ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఏపీ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి ఊమెన్‌ చాందీ సూచించారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్‌లో జరిగిన కాంగ్రెస్ పార్టీ పీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

Congress Executive Meeting
Congress Executive Meeting

By

Published : Dec 22, 2021, 12:42 PM IST

Updated : Dec 22, 2021, 1:33 PM IST

PCC Executive Committee meeting today: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫ‌ల్యాల‌ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు పార్టీ నేత‌లు కృషి చేయాల‌ని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవ‌హారాల ఇంఛార్జ్‌, ఏఐసీసీ కార్యద‌ర్శి ఉమెన్ చాందీ సూచించారు. ప్రజా వ్యతిరేక విధానాల‌ను నిర‌సిస్తూ.. ప్రజ‌ల్లోకి వెళ్లాలన్నారు. ఈ మేరకు విజ‌య‌వాడ‌లోని ఆంధ్రర‌త్న భ‌వ‌న్‌లో జరిగిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ క‌మిటీ స‌మావేశంలో ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా జాతీయ ప‌తాకాన్ని ఆవిష్కరించారు.

పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం..

స‌మావేశంలో ప్రధానంగా ఇటీవ‌ల కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా చేప‌ట్టిన జ‌న జాగ‌ర‌ణ అభ‌యాన్, స‌భ్యత్వ న‌మోదు, సేవ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో అన్ని జిల్లాల్లో నిర్వహించిన పాద‌యాత్రలపై సుదీర్ఘంగా చ‌ర్చించారు. భ‌విష్యత్తులో పార్టీని ఎలా ముందుకు తీసుకువెళ్లాల‌న్న అంశంపై పార్టీ నేతలకు ఉమెన్ చాందీ దిశానిర్దేశం చేశారు.

రోశ‌య్యకు నివాళి..
అంతకుమందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, త‌మిళ‌నాడు మాజీ గ‌వ‌ర్నర్ దివంగ‌త కొణిజేటి రోశ‌య్యకు పార్టీ నేత‌లు, కార్యక‌ర్తలు నివాళుల‌ర్పించారు. అన్ని జిల్లాల నుంచి పార్టీ నేత‌లు వచ్చి రోశయ్యకు అంజలి ఘటించారు. ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌, ఇతర సీనియర్ నేతలు.. మెయ్యప్పన్‌, క్రిష్ట‌ఫ‌ర్‌, ఏఐసీసీ కార్యద‌ర్శి గిడుగు రుద్రరాజు, చింతా మోహ‌న్‌, త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి..

Pedanandipadu Issue: పెదనందిపాడు ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ, ఎస్సీ కమిషన్లకు తెదేపా ఫిర్యాదు

Last Updated : Dec 22, 2021, 1:33 PM IST

ABOUT THE AUTHOR

...view details