ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'కాపుల సంక్షేమంపై కాకి లెక్కలు చెబుతున్నారు' - కాపుల సంక్షేమంపై కాకి లెక్కలు చెబుతున్నారు

అధికారంలోకి రావడానికి కాపుల మద్దతు తీసుకున్న జగన్​... అధికారంలోకి వచ్చాక రిజర్వేషన్లు అమలు చేయకుండా ద్రోహం చేస్తున్నారని ఏఐసీసీ సభ్యులు నరహరశెట్టి నరసింహరావు ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం ఇచ్చిన 5 శాతం రేజర్వేషన్లు అమలు చేయకుండా కాపుల సంక్షేమంపై కాకి లెక్కలు చెబుతున్నారని మండిపడ్డారు.

'కాపుల సంక్షేమంపై కాకి లెక్కలు చెబుతున్నారు'
'కాపుల సంక్షేమంపై కాకి లెక్కలు చెబుతున్నారు'

By

Published : Jul 6, 2020, 3:22 PM IST

ప్రతిపక్ష నాయకుడిగా కాపులకు రిజర్వేషన్లు అమలు చేయాలన్న జగన్.. అధికారంలోకి వచ్చాక అమలు చేయకపోవడం దారుణమని ఏఐసీసీ సభ్యులు నరహరశెట్టి నరసింహరావు వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం ఇచ్చిన 5 శాతం రేజర్వేషన్లు అమలు చేయకుండా కాపుల సంక్షేమంపై కాకి లెక్కలు చెబుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో కోటి 10 లక్షల మంది కాపులున్నారని... ప్రభుత్వం వారి సంక్షేమంపై చెబుతున్న లెక్కలన్నీ అవాస్తవాలన్నారు.

అధికారంలోకి రావడానికి కాపుల మద్దతు తీసుకున్న జగన్​...అధికారంలోకి వచ్చాక రిజర్వేషన్లు అమలు చేయకుండా ద్రోహం చేశారన్నారని ధ్వజమెత్తారు. కొందరి స్వార్థ రాజకీయాల వల్ల కాపులకు ఉన్న రిజర్వేషన్లు కోల్పోయామని.. కాంగ్రెస్ పార్టీ కాపు రిజర్వేషన్లు కల్పించడానికి చిత్తశుద్ధితో ఉందన్నారు.

ABOUT THE AUTHOR

...view details