ప్రణబ్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ పార్టీ గొప్ప నాయకుడిని కోల్పోయిందని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. దేశం కోసం ఎంతో సేవ చేసిన ప్రణబ్ ముఖర్జీ మరణం బాధాకరమన్నారు. ఎటువంటి విపత్కర పరిస్థితి ఎదురైనా సమర్థవంతంగా పరిష్కారం చూపేవారని గుర్తు చేసుకున్నారు. నేటి రాజకీయ నాయకులకు ప్రణబ్ ఆదర్శప్రాయులన్నారు. మన దేశం, మా పార్టీ ఒక శిఖరాన్ని కోల్పోయిందని.. ఆయన కుటుంబ సభ్యులకు శైలజానాథ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ గొప్ప నేతను కోల్పోయింది: శైలజానాథ్ - మాజీ రాష్ట్రపతి ప్రణబ్ మృతి
కాంగ్రెస్ రాష్ట్ర కార్యాలయంలో ప్రణబ్ ముఖర్జీకి ఆ పార్టీ నేతలు నివాళులర్పించారు. ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.
కాంగ్రెస్ పార్టీ గొప్ప నేతను కోల్పోయింది: శైలజానాథ్