Congress leaders protest: కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ విమర్శించారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఈడీ కేసులు బనాయించడాన్ని నిరసిస్తూ విజయవాడ ధర్నాచౌక్‌లో ఆ పార్టీ నేతలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా శైలజానాథ్ మాట్లాడుతూ.. రాజకీయ కక్షతో గాంధీ కుటుంబ సభ్యులను నిందితులుగా చూపే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఎప్పుడో మూసివేసిన నేషనల్ హెరాల్డ్ కేసును తవ్వితీశారని పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చాక.. భాజపా అక్రమాలను వెలికి తీస్తామని చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాలనలో మత విద్వేషాలు రెచ్చగొట్టడం తప్ప.. అభివృద్ధి లేదని విమర్శించారు.
కేంద్రం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది: సాకే శైలజానాథ్ - రాహుల్ సోనియాలపై కేసులను నిరసిస్తూ కాంగ్రెస్ ధర్నా
Congress leaders protest: కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ ధ్వజమెత్తారు. సోనియా, రాహుల్‌లపై కేసులకు నిరసనగా విజయవాడ ధర్నాచౌక్‌లో కాంగ్రెస్ నేతలు ధర్నా చేపట్టారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాలనలో మత విద్వేషాలు రెచ్చగొట్టడం తప్ప.. అభివృద్ధి లేదని దుయ్యబట్టారు.
పెరిగిన ధరలతో ప్రజలు, రైతులు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దువల్ల మేలు జరగకపోగా, రూపాయి విలువ అత్యంత కనిష్ఠ స్థాయికి చేరిందని విమర్శించారు. రాహుల్ గాంధీ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక.. ఈడీ కేసులు నమోదు చేయించి, విచారణ జరిపించడం దుర్మార్గమని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్లు తులసిరెడ్డి, షేక్ మస్తాన్ వలీ మాట్లాడుతూ.. నేషనల్ హెరాల్డ్ విషయంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని పేర్కొన్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులంతా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ విజయవాడ నగర అధ్యక్షుడు నరహరశెట్టి నరసింహారావు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: