అగ్ర కులాల్లోని పేద యువతకు కేంద్ర ప్రభుత్వం కల్పించిన 10 శాతం ఈడబ్యూఎస్ రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ తులసిరెడ్డి డిమాండ్ చేశారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, కాపు, తెలగ, బలిజ, ఒరిటరి, రెడ్ది, కమ్మ, వెలమ, జాట్, రాజ్పుత్, సయ్యద్, మొగల్, పఠాన్ తదితర అగ్రకులాలకు చెందిన పేద కుటుంబాల్లో ప్రతిభావంతులైన నిరుద్యోగ యువత ఉందన్నారు. వీరికి ఈడబ్యూఎస్ రిజర్వేషన్ అమలు చేయాలని తులసిరెడ్డి.. ముఖ్యమంత్రి జగన్కు లేఖ రాశారు.
2019 ఫిబ్రవరి 1 నుంచి కేంద్ర ప్రభుత్వ విద్యాలయాలు, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలవుతున్నాయన్న తులసిరెడ్డి.. మన రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు కావడం లేదని లేఖలో పేర్కొన్నారు. జీవో 60 ద్వారా ప్రభుత్వ విద్యాలయాల్లోనూ ఇది ఉందన్నారు. వెంటనే ఉద్యోగాల్లో కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేయాలని కోరారు.