పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం పెట్టినా తెలుగు మాధ్యమం రద్దు చేయవద్దని.. రాష్ట్ర కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి అన్నారు. ఈ ఏడాది తెలుగు మాధ్యమం రద్దు చేస్తామనడం చారిత్రక తప్పిదమని విమర్శించారు. అమ్మ ఒడి పథకానికి నిధులు వివిధ కార్పొరేషన్ల నుంచి మళ్లించారని.. అలా కాకుండా ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించాలని అన్నారు.
'ఆంగ్ల మాధ్యమం పెట్టండి.. తెలుగు మాధ్యమం ఉంచండి'
వైకాపా ప్రభుత్వం ఈ ఏడాది పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేస్తామనడం చారిత్రక తప్పిదమని.. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టినా తెలుగు మాధ్యమాన్ని కొనసాగించాలని కోరారు.
తులసిరెడ్డి, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్
వైకాపా ఏడాది పాలనలో 'పని మూరెడు ప్రచారం బారెడు'లా ఉందని ఎద్దేవా చేశారు. ఉన్నత, ప్రాథమిక విద్యలకు కేటాయించిన బడ్జెట్‌లో సగం కూడా ఖర్చు పెట్టలేదన్నారు.
ఇవీ చదవండి.. ఆంగ్ల మాధ్యమం తీసుకొస్తే తెలుగును అవమానపరిచినట్లా: జగన్