ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే పెరుగుతున్న మరణాలు'

కరోనా కారణంగా మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని.. కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ ప్రార్థనలు నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే ప్రజలు ప్రాణాలు పోతున్నాయని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

prayers
prayers

By

Published : May 9, 2021, 4:49 PM IST

కరోనా కారణంగా మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని.. కాంగ్రెస్ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ.. మూడు మతాలకు చెందిన పెద్దలతో పార్ధనలు నిర్వహించారు. కరోనాతో చనిపోయిన వారికి పిండ ప్రదానం చేశారు. వైరస్​తో పోరాడి అసువులు బాసిన ప్రతి ఒక్కరి మరణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలన్నారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి జగన్ నిర్లక్ష్యం వల్లే కరోనాకి ఇంతమంది బలైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

వ్యాధి నియంత్రణకు చర్యలు తీసుకోకపోగా.. ప్రజలను పక్కదారి పట్టించి నేడు ఇంతమంది మరణాలకు కారణమవుతున్నారని మండిపడ్డారు. సెకండ్ వేవ్ వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నా.. దానిని ఎలా ఎదుర్కోవాలని కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేయలేదని ఆగ్రహించారు. ఆసుపత్రుల్లో పడకలు, ఆక్సిజన్ సిలిండర్లు లేక ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారని ఆవేదన చెందారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్లు తెరిచి కరోనా బారి నుంచి ప్రజలను రక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని పద్మశ్రీ డిమాండ్ చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details