ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'రైతులకు నష్టం చేసే కుట్ర జరుగుతోంది' - కాంగ్రెస్ కిసాన్ సెల్ తాజా వార్తలు

రాష్ట్రంలో రైతులను నష్టపరిచే పనులు జరుగుతున్నాయని కాంగ్రెస్ కిసాన్ సెల్ ఛైర్మన్ గుర్నాధరావు ఆరోపించారు. నూతనంగా ఏర్పాటు చేస్తున్న మీటర్లు రైతులకు నష్టం కలిగిస్తాయని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఇబ్బంది కలిగే నిర్ణయాలు తీసుకుంటున్నాయని ధ్వజమెత్తారు.

jetti gurunadha rao comments on new meters
మాట్లాడుతున్న జెట్టి గుర్నాధరావు

By

Published : Sep 4, 2020, 11:32 AM IST

జగన్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైనా… ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదని కాంగ్రెస్ కిసాన్ సెల్ ఛైర్మన్ జెట్టి గుర్నాధరావు ఆరోపించార. విజయవాడ ఆంధ్రరత్న భవన్​లో గుర్నాధరావు మీడియాతో మాట్లాడారు. ఎన్నికల మేనిపెస్టోలో రూ.12,500 రైతు భరోసా కింద ఇస్తానని చెప్పి… రూ.7500 ఇస్తూ రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు. వ్యవసాయ మోటార్లకు మిటర్లను బిగిస్తామని తెలిపిన ప్రభుత్వం... రైతు వ్యతిరేక విధానాలను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు. మీటర్ల ద్వారా రైతులు నష్టపోతారని, రైతులను నాశనం చేసే విధంగా కుట్ర జరుగుతుందని ఆయన ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details