విజయవాడ నగర శివారు కండ్రిగలో వినాయకుని నిమజ్జనం వేడుకలో ఘర్షణ జరిగింది. నిమజ్జనం విషయంలో వైకాపా, తెదేపా కార్యకర్తల మధ్య వివాదం తలెత్తింది. పోలీసుల సమక్షంలోనే వైకాపా కార్యకర్తలు తెదేపా నాయకులు కొట్టారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ఘటనతో అప్రమత్తమైన నున్న గ్రామీణ పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.
ASSAULT : వినాయక నిమజ్జన వేడుకలో ఘర్షణ... తెదేపా నేతలపై వైకాపా కార్యకర్తల దాడి - vijayawada crime
విజయవాడ కండ్రిగలో వినాయక నిమజ్జన వేడుకలో భాగంగా... తెదేపా, వైకాపా నేతల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసుల సమక్షంలోనే వైకాపా నేతలు తెదేపా కార్యకర్తలను కొట్టడంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది.
వినాయక నిమజ్జన వేడుకలో ఘర్షణ