'జీఎస్టీ రిటర్ను దాఖలు ఇప్పుడు మరింత సులభం' - 2020-2021 gst returns news in telugu
జీఎస్టీ నూతన విధానాలతో రిటర్నులు దాఖలు చేయడం మరింత సులభతరమని ఆర్థికరంగ విశ్లేషకులు, చార్టర్డ్ అకౌంటెంట్ పరుచూరి లక్ష్మణరావు అన్నారు. ఏప్రిల్ 1 నుంచి అమలయ్యే ఈ విధానం ప్రకారం చిన్నా, పెద్ద వ్యాపారులను సహజ్, సుగమ్గా వర్గీకరించి నూతన ఫైలింగ్ పద్ధతులను తీసుకొస్తున్నట్లు తెలిపారు.
జీఎస్టీలో తీసుకొచ్చిన నూతన విధానాలతో రిటర్నులు దాఖలు చేయడం మరింత సులభతరమైందని ఆర్థికరంగ విశ్లేషకులు, చార్టర్డ్ అకౌంటెంట్ పరుచూరి లక్ష్మణరావు అన్నారు. విజయవాడ సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కళాశాలలో 2020-21కి సంబంధించి జీఎస్టీలో చేసిన మార్పులపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఏప్రిల్ 1 నుంచి అమలయ్యే ఈ విధానం ప్రకారం చిన్నా, పెద్ద వ్యాపారులను సహజ్, సుగమ్గా వర్గీకరించి నూతన ఫైలింగ్ పద్ధతులను తీసుకొస్తున్నట్లు తెలిపారు. రిటర్నులు ఫైల్ చేసే సమయంలో వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కోకుండా అవగాహన కోసం ఇప్పటి నుంచే జీఎస్టీ వెబ్సైట్లో ప్రాక్టీస్ చేసే అవకాశం ఉందని వివరించారు.