ఎయిడెడ్ విద్యాసంస్థల ప్రైవేటీకరణను కాకినాడలో విద్యార్థులు మరోసారి నినదించారు. ఐడియల్ కళాశాలను ప్రైవేటీకరించే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కలెక్టరేట్ ను ముట్టడించేందుకు యత్నించారు. జోరు వానలోనూ ఆందోళన చేశారు. ఈ క్రమంలో విద్యార్థుల్ని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా... తోపులాట జరిగింది. పోలీసులు తమపై లాఠీ ఛార్జ్ చేశారంటూ.... కలెక్టరేట్ ఎదుట విద్యార్థులు బైఠాయించి ఆందోళన చేశారు. వేల మంది పేద విద్యార్థులు చదువుకునే... ఎయిడెడ్ కళాశాల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
గుంటూరు జిల్లాలో...
నగరంలోనూ ఎస్వీఆర్ఎమ్(S.V.R.M) కళాశాల విద్యార్థులు నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నగరం- రేపల్లె ప్రధాన రహదారి పై ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో విద్యార్థి నాయకులను అదుపులోకి తీసుకుని స్టేషన్ తరలిస్తున్న పోలీసులను విద్యార్థులు అడ్డుకున్నారు. ఎయిడెడ్ కళాశాలల విలీనం వలన ఎంతో మంది పేద విద్యార్దులు నష్టపోతారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఎయిడెడ్ విద్యాసంస్థల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈనెల 16న రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి పిలుపునిచ్చినట్లు విద్యార్థి సంఘాల నేతలు తెలిపారు. గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించారు. విద్యాశాఖ మంత్రి కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ అశోక్ బాబు విమర్శించారు. అసెంబ్లీ సమావేశాలలో విద్యార్థులు తరపున తమ గళం వినిపిస్తామన్నారు.
"ఎయిడెడ్ విద్యాసంస్థలను రద్దు చేస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేయాలి. ఎయిడెడ్ పాత విధానాన్నే కొనసాగించాలి. అంతేకాకుండా ఎయిడెడ్ విద్యాసంస్థల్లో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి" -అశోక్ బాబు, ఎమ్మెల్సీ
అనంతపురంలో..