ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఆన్​లైన్ బోధనా తరగతులతో సిలబస్ పూర్తి చేయండి' - ఏపీలో ఆన్​లైన్ బోధనా తరగతులు

ఈ విద్యా సంవత్సరంలో పూర్తికాని సిలబస్​ను.. ఆన్​లైన్ ద్వారా బోధన చేపట్టి పూర్తి చేయాలని అధికారులను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఆదేశించారు. పాఠశాల విద్యలో దూరదర్శన్, ఆకాశవాణి ద్వారా చేపట్టే కార్యక్రమాలను పరిశీలించాలని సూచించారు.

మంత్రి ఆదిమూలపు సురేశ్
మంత్రి ఆదిమూలపు సురేశ్

By

Published : Apr 22, 2020, 2:40 AM IST

ఈ విద్యా సంవత్సరంలో పూర్తికాని సిలబస్​ను ఆన్​లైన్ ద్వారా బోధన చేపట్టి.. పూర్తి చేయాలని మంత్రి ఆదిమూలపు సురేశ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, విద్యాశాఖ అధికారులతో ఆదిమూలపు సురేశ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అవసరమైతే పరీక్షలు కూడా ఆన్​లైన్ ద్వారా నిర్వహించాలన్నారు. 2021 విద్యాసంవత్సరంలో మెుత్తం పనిదినాలు 220కి తగ్గకుండా చూసుకోవాలన్నారు.

ఉన్నత విద్య సంస్కరణల కోసం విడుదల చేసిన జీవో 63 అమలు జరిగేలా చూడాలని మంత్రి సురేశ్ ఆదేశించారు. వచ్చే విద్యాసంవత్సరంలో ఇతర దేశాలకు వెళ్లలేని విద్యార్థులు ఇక్కడ కళాశాలల్లో చేరేందుకు అవకాశాల కోసం చూస్తారని.. కోర్సులు, సీట్ల కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. క్వారంటైన్ కేంద్రాలుగా వినియోగిస్తున్న హాస్టల్, ఇతర విద్యాశాఖ భవనాలు తిరిగి వినియోగించుకునే ముందు సంబంధిత జిల్లా వైద్యశాఖ అధికారులతో యుటిలైజేషన్ సర్టిఫికేట్ పొందాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details