రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి దాఖలైన నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియ పూర్తైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. స్క్రూటినీ అనంతరం వైకాపా నుంచి దాఖలైన నాలుగు నామినేషన్లు సక్రమంగా ఉన్నట్లు నిర్ధరించింది. వైకాపా రాజ్యసభ అభ్యర్థులుగా నిరంజన్ రెడ్డి, బీద మస్తాన్ రావు, ఆర్.కృష్ణయ్య, విజయసాయి రెడ్డి బరిలో ఉన్నట్టు స్పష్టం చేసింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు తర్వాత వారు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఈసీ ప్రకటన చేయనుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు జూన్ 3 తేదీగా ఈసీ పేర్కొంది.
రాజ్యసభ ఎన్నికలు.. నామినేషన్ల స్క్రూటినీ పూర్తి.. బరిలో వాళ్లే - రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్క్రూటినీ పూర్తి
YSRCP Candidates in Rajyasabha Polls: రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియ పూర్తైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. స్క్రూటినీ అనంతరం వైకాపా నుంచి దాఖలైన నాలుగు నామినేషన్లు సక్రమంగా ఉన్నట్లు ఈసీ నిర్ధరించింది.
నామినేషన్ల స్క్రూటినీ పూర్తి