ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పోలవరం నిర్వాసితులకు పరిహారం చెల్లించాలి: మంత్రులు - Ministers Review on Polavaram

పోలవరం ప్రాజెక్టులో నిర్వాసితులకు పరిహారం చెల్లించాల్సి ఉందని ఉపముఖ్యమంత్రి ఆళ్లనాని... ఇరిగేషన్ మంత్రి అనిల్ దృష్టికి తీసుకొచ్చారు. పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాల ఉన్నతాధికారులు సమావేశానికి హాజరై పురోగతిని మంత్రికి వివరించారు.

పోలవరంపై సమీక్ష
పోలవరంపై సమీక్ష

By

Published : Jun 10, 2021, 4:30 PM IST

పోలవరం ప్రాజెక్టులో నిర్వాసితులకు త్వరగా పరిహారం చెల్లించాల్సి ఉందని.. ఉపముఖ్యమంత్రి ఆళ్లనాని విజ్ఞప్తి చేశారు. జలవనరుల శాఖ క్యాంపు కార్యాలయంలో మంత్రి అనిల్​కుమార్ యాదవ్ నిర్వహించిన సమీక్షా సమావేశానికి ఆళ్ల నాని హాజరయ్యారు. ఆయనతో పాటు మంత్రి పేర్నినాని సైతం ఈ సమీక్షలో పాల్గొన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు ప్రాంతంలో పనులు వేగంగా జరుగుతున్నందునా.. ముంపు ప్రాంతాల బాధితులకు పరిహారం, పునరావాస కాలనీల నిర్మాణం చేపట్టాల్సి ఉందని మంత్రి అనిల్​ అధికారులకు స్పష్టం చేశారు. పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాల ఉన్నతాధికారులు సమావేశానికి హాజరై పురోగతిని మంత్రికి వివరించారు.

ABOUT THE AUTHOR

...view details