రాష్ట్రంలో పేదల గృహ రుణాలకు సంబంధించి వన్ టైమ్ సెటిల్మెంట్ పథకం అమలును సమీక్షించేందుకు ప్రభుత్వం.. మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని గృహ నిర్మాణ పథకంలో భాగంగా లబ్ధిదారులు తీసుకున్న రుణాల చెల్లింపునకుగాను ప్రభుత్వం ఒన్ టైమ్ సెటిల్ మెంట్ పథకాన్ని ప్రకటించింది. దీని పర్యవేక్షణ కోసం మంత్రుల కమిటీని ప్రభుత్వం నియమించింది. కమిటీ కన్వీనరుగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని సభ్యులుగా డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రులు బొత్స, శ్రీ రంగనాథ రాజులను నియమించారు. వారానికోసారి ఈ పథకంపై కేబినెట్ సబ్ కమిటీ సమీక్ష చేయనుంది.
వన్ టైమ్ సెటిల్మెంట్ పథకం అమలుపై మంత్రుల కమిటీ - మంత్రుల కమిటీ
పేదల గృహ రుణాలకు సంబంధించి వన్ టైమ్ సెటిల్మెంట్ పథకం అమలును సమీక్షించేందుకు ప్రభుత్వం.. మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది. వారానికొసారి ఈ పథకంపై కేబినెట్ సబ్ కమిటీ సమీక్ష చేయనుంది.
AP