ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Committee: పీజీ, యూజీ వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశంపై ఏకీకృత కౌన్సెలింగ్‌కు కమిటీ - పీజీ, యూజీ వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశంపై ఏకీకృత కౌన్సెలింగ్‌కు కమిటీ వార్తలు

పీజీ, యూజీ వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశంపై ఏకీకృత కౌన్సెలింగ్‌కు ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. ఎవరికీ నష్టం కలగకుండా కౌన్సెలింగ్ విధానం తెచ్చేందుకు వారంలోగా నివేదిక సమర్పించాలని కమిటీని ప్రభుత్వం ఆదేశించింది.

Committee for Unified Counseling on Admission to PG and UG Medical Courses
పీజీ, యూజీ వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశంపై ఏకీకృత కౌన్సెలింగ్‌కు కమిటీ

By

Published : Jul 14, 2021, 9:41 PM IST

Updated : Jul 14, 2021, 10:03 PM IST

పీజీ, యూజీ వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికి ఏకీకృత కౌన్సెలింగ్ విధానం కోసం ఉన్నతస్థాయి కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కోర్సుల్లో ప్రవేశానికి ఏకీకృత కౌన్సెలింగ్ నిర్వహించే అంశంపై కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనల పరిశీలనకు ఈ కమిటీని ఏర్పాటు చేస్తూ వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.

ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం వైస్​ఛాన్స్​లర్ పి. శ్యామ్ ప్రసాద్ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కమిటీని నియమించింది. ఎవరికీ నష్టం కలగకుండా కౌన్సెలింగ్ విధానం తెచ్చేందుకు వారంలోగా నివేదిక సమర్పించాలని కమిటీని ప్రభుత్వం ఆదేశించింది.

Last Updated : Jul 14, 2021, 10:03 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details