వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం అమలుకు ప్రభుత్వం మంత్రుల కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీరాజ్, రెవెన్యూ, మున్సిపల్ శాఖ మంత్రులతో కమిటీ ఏర్పాటైంది.
కమిటీ సభ్యులుగా మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స, కృష్ణదాస్ వ్యవహరించనున్నారు. సమగ్ర సర్వే కార్యక్రమం విస్తృతిపై కమిటీ దృష్టి సారించనుంది. వారానికి ఒకసారైనా సమావేశమై పనుల పురోగతి పర్యవేక్షించాలని కమిటీకి ప్రభుత్వం సూచించింది.