రాష్ట్రంలోని డిప్లొమా ఉపాధ్యాయ విద్యా(డీఈడీ) కళాశాలలు అక్రమంగా స్పాట్ ప్రవేశాలు కల్పిస్తున్నాయని... పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ కాంతారావు తెలిపారు. 770 కళాశాలల ధ్రువపత్రాల పరిశీలనకు తాఖీదులు ఇచ్చామని, ఇందులో 350 సంస్థలు హాజరయ్యాయని వెల్లడించారు. వీటిలోనూ చాలా కళాశాలల్లో నాణ్యత ప్రమాణాలు శూన్యమని అన్నారు.
'డీఈడీ కళాశాలల్లో అక్రమంగా ప్రవేశాలు కల్పిస్తున్నారు' - పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ కాంతారావు తాజా వార్తలు
రాష్ట్రంలోని డిప్లొమా ఉపాధ్యాయ విద్యా(డీఈడీ) కళాశాలలు అక్రమంగా స్పాట్ ప్రవేశాలు కల్పిస్తున్నాయని... పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ కాంతారావు తెలిపారు. చాలా కళాశాలల్లో నాణ్యత ప్రమాణాలు శూన్యమని ఆయన తెలిపారు.
'డీఈడీ కళాశాలల్లో అక్రమంగా స్పాట్ ప్రవేశాలు కల్పిస్తున్నారు'
విద్యార్థులు, అధ్యాపకుల హాజరు, ప్రాక్టికల్స్ నిర్వహణ, వసతుల కల్పనలో అవకతవకలు ఉన్నట్లు తేలిందన్నారు. కొన్ని కళాశాలలు స్వచ్ఛందంగా మూసి వేసుకోవడానికి అనుమతి కోరాయని పేర్కొన్నారు. ధ్రువపత్రాల పరిశీలనకు గైర్హాజరైన వాటిని కమిషన్ త్వరలో తనిఖీ చేస్తుందని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 60శాతం కళాశాలలు తనిఖీ చేయబోతున్నామని తెలిపారు.
ఇదీ చదవండి:పంచాయతీ పోరు: ప్రారంభమైన తుది దశ పోలింగ్