ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Santhosh babu Family: గుండెల్లో బాధ కన్నా.. గర్వమే ఎక్కువ.. - Colonel Santosh Babu wife santhishi

గాల్వన్​ లోయ ఘర్షణలో కర్నల్ సంతోశ్​బాబు ప్రాణాలు కోల్పోయి నేటికి ఏడాది పూర్తవుతోంది. సంతోశ్​ బాబు మరణంతో తన కుటుంబంలో విషాదం నిండినా.. వారిలో బాధ కన్నా.. దేశం కోసం ప్రాణాలొదిలాడన్న గర్వమే ఎక్కువగా కనబడుతోంది. భర్త జ్ఞాపకాలతో.. కాలం వెళ్లదీస్తున్న ఆయన భార్య సంతోషి.. ఇప్పుడిప్పుడే వాస్తవ ప్రపంచంలోకి వస్తున్నానని చెప్పారు.

Santhosh babu Family
Santhosh babu Family

By

Published : Jun 15, 2021, 1:09 PM IST

గాల్వన్‌ లోయ ఘర్షణలో కర్నల్‌ సంతోశ్​బాబు అసువులు బాసి నేటికి ఏడాది పూర్తవుతోంది. సంతోశ్​బాబు వీరమరణం.. ఆయన కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. అయినా వారి గుండెల్లో బాధ కన్నా.. గర్వమే ఎక్కువగా కనబడుతోంది. సంతోశ్‌ బాబు ప్రాణత్యాగం చేసేనాటికి.. ఆయనకు భార్య సంతోషి, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

కర్నల్‌ మరణంతో ఆయన భార్యపై ఒక్కసారిగా కుటుంబ బాధ్యతలు పడ్డాయి. ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగానికి శిక్షణలో ఉన్న సంతోషి.. భర్త జ్ఞాపకాలతోనే కాలం వెళ్లదీస్తున్నానని చెబుతున్నారు. పిల్లల భవిష్యత్​ కోసం ప్రణాళిక వేసుకుంటున్నానని తెలిపారు. ప్రతి ఒక్కరూ తనకు అండగా నిలుస్తున్నారంటూ.. తన మనోవేదనను ఈటీవీ భారత్​తో పంచుకున్నారు.

.

ABOUT THE AUTHOR

...view details