డ్రాగన్ల దాడిలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్‌బాబు అంతిమ యాత్ర సూర్యాపేటలో ప్రారంభమైంది. విద్యానగర్ నుంచి ఎంజీరోడ్, శంకర్ విలాస్ సెంటర్, రైతు బజార్, పాత బస్టాండ్, కోర్టు చౌరస్తా, ఎస్పీ కార్యాలయం మీదుగా కేసారం వరకు యాత్ర సాగుతోంది. కుటుంబ సభ్యులు, సైనిక దళాలు, అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు అంతిమయాత్రలో పాల్గొన్నారు.
తెలంగాణ: అమరుడు కల్నల్ సంతోష్‌బాబు అంతిమ యాత్ర ప్రారంభం - చైనా భారత్ వివాదం వార్తలు
కల్నల్ సంతోష్ బాబు అంతిమయాత్ర ప్రారంభమైంది. తెలంగాణలోని సూర్యాపేట విద్యానగర్ నుంచి కేసారం వరకు అంతిమయాత్ర సాగుతోంది. కేసారం వ్యవసాయ క్షేత్రంలో సైనిక లాంఛనాలతో కల్నల్ సంతోష్‌బాబు అంత్రక్రియలు జరగనున్నాయి.
colonel-santosh-babu-final-journey-started-in-suryapet
కేసారంలోని వ్యవసాయక్షేత్రంలో సైనిక లాంఛనాలతో సంతోష్‌బాబు అంత్యక్రియలు జరగనున్నాయి. సైనిక సంస్కారాల ప్రక్రియలో 16 బిహార్ రెజిమెంట్ బృందం పాల్గొంటుంది. కరోనా వైరస్ మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని పురపాలిక అధికారులు ముందు జాగ్రత్తగా పటిష్ఠ చర్యలు తీసుకున్నారు.